Skip to main content

ప్రముఖ ఉర్దూ కవి రహత్‌ కన్నుమూత

ప్రఖ్యాత ఉర్దూకవి రహత్‌ ఇండోరి (70) ఆగస్టు 11న గుండెపోటుతో మరణించారు. ఇటీవలే ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.
Current Affairs
దీంతో మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఇండోరి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఉర్దూ సాహిత్యంపై పట్టున్న ఇండోరికి దేశ విదేశాల్లో చాలామంది అభిమానులున్నారు. ముఖ్యంగా ఉర్దూలో ద్విపదలను తనదైన శైలిలో రచించారు. మున్నాభాయ్‌ ఎంబీబీఎస్, కరీబ్, ఘటక్‌ లాంటి పలు హిట్‌ చిత్రాల్లో మేలిమి పాటలను ఆయన రచించారు. ఇండోరి రచించిన ‘‘బులాతా హై, మగర్‌ జానే కా నహీ’’, ‘‘సభీకా కానూన్హై షామిల్‌ యహాకీ మిట్టీ మే’’తదితర కవితలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రఖ్యాత ఉర్దూకవి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : రహత్‌ ఇండోరి (70)
ఎక్కడ : ఇండోర్, మధ్యప్రదేశ్
ఎందుకు: గుండెపోటు కారణంగా
Published date : 12 Aug 2020 05:29PM

Photo Stories