Skip to main content

ప్రముఖ సంపాదకుడు రాఘవాచారి కన్నుమూత

ప్రముఖ సంపాదకుడు, సాహితీవేత్త, కమ్యూనిస్టు నేత చక్రవర్తుల రాఘవాచారి(81) కన్నుమూశారు. కిడ్నీ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అక్టోబర్ 28న హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
రాఘవాచారి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాంతాపురానికి చెందిన వరదాచారి, కనకమ్మ దంపతులకు 1939 సెప్టెంబర్ 10న జన్మించారు. హైదరాబాద్‌లో లా చదివిన ఆయన ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1972లో విశాలాంధ్ర ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించి 2005 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఉస్మానియా, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో జర్నలిజం విజిటింగ్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. సీపీఐ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యునిగా రాఘవాచారి వ్యవహరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రముఖ సంపాదకుడు, సాహితీవేత్త కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : చక్రవర్తుల రాఘవాచారి(81)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 29 Oct 2019 06:03PM

Photo Stories