Skip to main content

ప్రముఖ సంగీత విద్వాంసురాలు, పద్మశ్రీ అవార్డీ కన్నుమూత

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత పరసాల బి.పొన్నమ్మాళ్‌ (96) కన్నుమూశారు.
Current Affairs
వయో సంబంధిత సమస్యల కారణంగా కేరళలోని వలియశాలలో ఉన్న స్వగృహంలో జూన్‌ 22న తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రపంచంలో పురుషాధిక్యతను సవాలు చేస్తూ 1940 ప్రాంతంలో చారిత్రక స్వాతి తిరునాల్‌ సంగీత కళాశాలలో చేరిన మొదటి విద్యార్థినిగా పొన్నమ్మాళ్‌ ఖ్యాతి పొందారు. గాన భూషణం, గాన ప్రవీణ కోర్సుల్లో మొదటి ర్యాంకులో ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత అదే కళాశాలలో బోధకురాలిగా, ప్రఖ్యాత ఆర్‌ఎల్‌వీ సంగీత, లలితకళల కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేశారు. 2006లో శ్రీ పద్మనాభస్వామి ఆలయ నవరాత్రి ఉత్సవాల్లో గానం చేసిన తొలి మహిళగా కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న పురుషుల ఆధిక్యతకు గండి కొట్టారు. పద్మశ్రీతోపాటు పలు అవార్డులు అందుకున్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, పద్మశ్రీ
ఎప్పుడు : జూన్‌ 22
ఎవరు : పరసాల బి.పొన్నమ్మాళ్‌ (96)
ఎక్కడ : వలియశాల, కేరళ
ఎందుకు : వయో సంబంధిత సమస్యల కారణంగా
Published date : 23 Jun 2021 06:56PM

Photo Stories