ప్రముఖ సాహితీవేత్త అన్నపరెడ్డి కన్నుమూత
Sakshi Education
ప్రముఖ సాహితీవేత్త అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (88) కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మార్చి 9న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1933 ఫిబ్రవరి 22న గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో జన్మించిన అన్నపరెడ్డి బౌద్ధానికి సంబంధించిన అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. 1991లో సోషియాలజీ లెక్చరర్‌గా పదవీ విరమణ పొందిన అనంతరం 30 గ్రంథాలు రచించారు. తెలుగు ప్రజలకు ‘ఫ్రాయిడ్’ను, మనోవిజ్ఞాన శాస్త్రాలను పరిచయం చేశారు.
కళారత్న పురస్కారం...
2000–2002 మధ్యకాలంలో కేంద్ర సాంస్కృతిక శాఖ సీనియర్ ఫెలోషిప్‌తో ‘తెలుగు సాహిత్యంపై బౌద్దం ప్రభావం’ అంశంపై అన్నపరెడ్డి పరిశోధన చేశారు. ఆయన జరిపిన సాహితీకృషికి గుర్తింపుగా ఏపీ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది.

అన్నపరెడ్డి రచనల్లో కొన్ని: ‘సిగ్మండ్ ఫ్రాయిడ్’, మానవీయ బుద్ధ, చింతనాగ్ని, కొడిగట్టినవేళ, ఆచార్య నాగార్జునుడు, మేధావుల మెతకలు, బుద్ధదర్శనం (అనువాదం), ‘బుద్ధుని సూత్రసముచ్చయం’(సుత్తనిపాతానువాదం).
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సాహితీవేత్త కన్నుమూత
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (88)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సాహితీవేత్త కన్నుమూత
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (88)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 10 Mar 2021 06:12PM