ప్రముఖ నటుడు వేణుమాధవ్ కన్నుమూత
Sakshi Education
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ (51) కన్నుమూశారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. నల్గొండ జిల్లాలోని కోదాడలో 1969 డిసెంబర్ 30న ప్రభాకర్-సావిత్రి దంపతులకు వేణుమాధవ్ జన్మించారు. మిమిక్రీ కళాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. దాదాపు 600 సినిమాల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంప్రదాయం’తో వెండితెరకు పరిచయం అయ్యారు. హంగామా, భూ కైలాస్, ప్రేమాభిషేకం చిత్రాల్లో హీరోగా నటించారు. ప్రేమాభిషేకం సినిమాను ఆయనే నిర్మించారు. వేణుమాధవ్ చారిటబుల్ ట్రస్ట్, వేణుమాధవ్ ఫ్రెండ్స్ సర్కిల్ పేర్లతో సేవాకార్యక్రమాలు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : వేణుమాధవ్ (51)
ఎక్కడ : సికింద్రాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : వేణుమాధవ్ (51)
ఎక్కడ : సికింద్రాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 26 Sep 2019 08:00PM