ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత
Sakshi Education
ప్రముఖ నటి గీతాంజలి (72) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు.
1947లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచయమైంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించింది. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించిన గీతాంజలి వివాహం ప్రముఖ నటుడు రామకృష్ణతో జరిగింది. దేవత, సంబరాల రాంబాబు, పంతాలు పట్టింపులు, శ్రీకృష్టపాండవీయం, పొట్టి ప్లీడరు, తోడు నీడ వంటి చిత్రాల్లో గీతాంజలి నటించి మెప్పించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ నటి కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : గీతాంజలి (72)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ నటి కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : గీతాంజలి (72)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు
Published date : 02 Nov 2019 06:18PM