ప్రముఖ మహిళల పేరిట విద్యాపీఠాలు ఏర్పాటు
Sakshi Education
పది మంది ప్రముఖ మహిళల పేరిట వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యాపీఠాలను నెలకొల్పనున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ జనవరి 24న ప్రకటించింది.
పరిపాలనదక్షులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, సంఘసంస్కర్తలుగా తమదైన ముద్రవేసిన ప్రముఖ మహిళల పేరిట ఈ పీఠాలు ఏర్పాటవుతాయని తెలిపింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సాయంతో వీటిని నెలకొల్పనున్నట్లు పేర్కొంది. ఈ విద్యాపీఠాల్లో ఆయా రంగాల్లో పరిశోధనలు చేపట్టనున్నారు. తొలుత ఐదేళ్ల కాలవ్యవధికి మాత్రమే వీటిని నెలకొల్పుతారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, మహాదేవి వర్మ, రాణి గైదిన్‌లియు తదితరుల పేరిట ఈ విద్యాపీఠాలు ఏర్పాటుకానున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 10 మంది ప్రముఖ మహిళల పేరిట విద్యాపీఠాలు ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ
ఎక్కడ : దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో
ఎందుకు : వివిధ రంగాల్లో పరిశోధనలు చేపట్టేందుకు

Published date : 25 Jan 2020 05:39PM