Skip to main content

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు ఇకలేరు

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు(64) ఇకలేరు.
Current Affairs
గత కొంతకాలంగా న్యూరో సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆమె ఇటీవల కోవడ్ బారిన పడ్డారు. శరీరంలో సోడియం లెవల్స్ పడిపోవడంతో హైదరబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అక్టోబర్ 14న తుదిశ్వాస విడిచారు. 1956లో విశాఖపట్నం అనకాపల్లిలో జన్మించిన శోభానాయుడు 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం శిష్యురాలిగా చేరి, సత్యభామ, పద్మావతి పాత్రల్లో విశేషంగా ఆకట్టుకున్నారు.

హైదరాబాద్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆఫ్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన శోభానాయుడు నృత్య గురువుగా వందల మంది శిష్యులను తయారు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవిదేశాల్లో ఆమె అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె భర్త సి.అర్జునరావు రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ సెక్రటరీగా పని చేశారు.

2001లో పద్మశ్రీ...
సంప్రదాయ నృత్యరంగంలో శోభానాయుడు సాగించిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను 2001లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది. మద్రాసులోని కృష్ణ గానసభ నుంచి ‘నృత్య చూడామణి’ (1982), ‘సంగీత నాటక అకాడమీ అవార్డు’ (1990), ‘నృత్యకళా శిరోమణి’ (1996), ‘ఎన్టీఆర్ అవార్డు’ (1998) వంటి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు(64)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్య సమస్యలతో
Published date : 15 Oct 2020 05:12PM

Photo Stories