ప్రముఖ కథా రచయిత సింగమనేని కన్నుమూత
Sakshi Education
రాయలసీమ అస్తిత్వ పోరాటాలకు సాహితీ పరిమళాలద్దిన ప్రముఖ కథా రచయిత, సాహితీ విమర్శకులు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకవర్గ సభ్యులు సింగమనేని నారాయణ (78) ఫిబ్రవరి 25న అనంతపురంలో కన్నుమూశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ కథా రచయిత, సాహితీ విమర్శకులు కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : సింగమనేని నారాయణ (78)
ఎక్కడ : అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు బండమీదపల్లిలో 1943 జూన్ 23న సింగమనేని జన్మించారు. తిరుపతిలోని ప్రాచ్య కళాశాలలో విద్వాన్ చదివిన ఆయన.. తెలుగు ఉపాధ్యాయునిగా 2001లో పదవీ విరమణ చేశారు.
కథకుడు, నవలా రచయితగా..
కథకుడు, నవలా రచయితగా..
- 1960లో ‘న్యాయమెక్కడ’ పేరుతో తొలికథ రచించిన సింగమనేని మొత్తం 43 కథలు రాశారు.
- జూదం, సింగమనేని కథలు, అనంతం అనే కథా సంపుటాలను, సీమ కథలు, ఇనుపగజ్జెల తల్లి, తెలుగు కథలు–కథన రీతులు, తెలుగు కథ మొదలైన పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.
- సంభాషణ అనే పేరుతో ఆయన రచించిన వ్యాస సంపుటి ఎంతోమందికి స్ఫూర్తినందించింది.
- అనుబంధాలు, అనురాగానికి హద్దులు, ఎడారి గులాబీలు నవలలు రాసి మెప్పించారు.
- ‘సింగమనేని’ని 2017లో రాష్ట్ర ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ కథా రచయిత, సాహితీ విమర్శకులు కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : సింగమనేని నారాయణ (78)
ఎక్కడ : అనంతపురం
Published date : 26 Feb 2021 06:20PM