ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత
Sakshi Education
శతాధిక చిత్రాల దర్శకుడిగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన కోడి రామకృష్ణ(63) అనారోగ్యంతో ఫిబ్రవరి 22న కన్నుమూశారు.
ఫిలింనగర్‌లోని నివాసంలో ఉదయం ఆయనకు స్వల్పంగా గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఫిలింనగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్ వెంచర్-2లోని నివాసానికి చేర్చారు.
ఫిలింనగర్‌తో విడదీయరాని అనుబంధం...
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఆయన అక్కడే లలితా కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. అనంతరం చలన చిత్ర పరిశ్రమకు వచ్చి సినీ దర్శకులు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డెరైక్టర్‌గా జీవితం ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ తరలిరాగా ఆయన దాసరితోపాటు ఇక్కడికి వచ్చారు. తన మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాను పూర్తిగా హైదరాబాద్‌లోనే తీయడం.. అదీ ఫిలింనగర్‌లోని ఓ ఇంట్లో చిత్రీకరించడం విశేషం.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత
ఎవరు: కోడి రామకృష్ణ
ఎప్పుడు: ఫిబ్రవరి 22
ఎందుకు : అనారోగ్యంతో
ఎక్కడ : హైదరాబాద్

Published date : 23 Feb 2019 06:00PM