Skip to main content

ప్రముఖ ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ భేటీ

దాదాపు 40 మంది పైగా ఆర్థికవేత్తలు, ప్రైవేట్ ఈక్విటీ.. వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, వ్యాపార దిగ్గజాలు, వ్యవసాయ రంగ నిపుణులు మొదలైన వారితో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
Current Affairsఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో జనవరి 9న జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక వృద్ధి, స్టార్టప్స్, నవకల్పనలు తదితర అంశాలపై విసృ్తత చర్చలు జరిపారు. సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ పాల్గొన్నారు.

తాజా భేటీలో మోదీ మాట్లాడుతూ... దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకునే సత్తా ఎకానమీకి పుష్కలంగా ఉందని తెలిపారు. 2024 నాటికి దేశ ఎకానమీ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని ధీమా వ్యక్తం చేశారు. ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్ల ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం అకస్మాత్తుగా పుట్టుకొచ్చినది కాదని.. దేశ సామర్థ్యంపై అవగాహనతోనే దీన్ని నిర్దేశించుకున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాలు సమష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమేనన్నారు.

మోదీతో నోబెల్ బహుమతి గ్రహీత టాలర్ భేటీ
ప్రధాని మోదీతో ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ టాలర్ జనవరి 9న భేటీ అయ్యారు. వ్యక్తుల నడవడిక, నిర్ణయాలపై ప్రభావం చూపే ఆర్థిక ప్రవర్తన సిద్ధాంతం (నడ్‌‌జ థియరీ)పై ఆయనతో చర్చించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆర్థికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, వ్యవసాయ రంగ నిపుణులతో భేటీ
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : నీతి ఆయోగ్, ఢిల్లీ
ఎందుకు : దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్న నేపథ్యంలో

మాదిరి ప్రశ్నలు
Published date : 10 Jan 2020 05:41PM

Photo Stories