Skip to main content

ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత విజయరెడ్డి ఇక లేరు

ప్రఖ్యాత సినీ దర్శకుడు, నిర్మాత బి. విజయరెడ్డి (84) ఇకలేరు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో అక్టోబర్ 9న తుదిశ్వాస విడిచారు.
Current Affairs
1936, జూలై 15న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విజయరెడ్డి జన్మించారు. నటనపై ఆసక్తితో అప్పటి మద్రాస్‌కు చేరుకున్న ఆయన పలు చిత్రాలకు సహాయ ఎడిటర్‌గా, సహాయ దర్శకుడిగా పనిచేశారు. 1966లో తెలుగులో ‘శ్రీమతి’ చిత్రం ద్వారా దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. 1970 విడుదలైన ‘రంగా మహల్ రహస్య’ అనే కన్నడ చిత్రం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. కన్నడలో 40 చిత్రాలను, హిందీలో 17 చిత్రాలను తెరకెక్కించిన ఆయన రాజ్‌కుమార్, విష్ణువర్థన్ , అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్‌కపూర్, జితేంద్ర, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలను చేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రఖ్యాత సినీ దర్శకుడు, నిర్మాత కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : బి. విజయరెడ్డి
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : కార్డియాక్ అరెస్ట్ కారణంగా
Published date : 14 Oct 2020 05:53PM

Photo Stories