Skip to main content

ప్రజ్ఞాన్ రోవర్‌ క్షేమం: సుబ్రమణియన్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి దశలో చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొని నాశనమైందని భావిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్‌.. నిజానికి ధ్వంసం కాలేదని చెన్నైకి చెందిన టెకీషణ్ముగసుబ్రమణియన్ వాదిస్తున్నారు.

Current Affairsఅందుకు సాక్ష్యాలుగా కొన్ని ఫొటోలతో ట్వీట్లు చేశారు. సుబ్రయణియన్ వాదన ప్రకారం...

  • ల్యాండర్‌ నుంచి విడివడిన ప్రజ్ఞాన్ కొద్ది మీటర్ల దూరం దొర్లుకుంటూ వెళ్లి నిలిచిపోయింది.
  • ప్రస్తుతం అది చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా ఉంది.
  • చంద్రుడి ఉపరితలంపై కూలిపోయిన తరువాత కూడా ల్యాండర్‌కు భూమి నుంచి సందేశాలు అంది ఉండవచ్చు. అయితే, అది మళ్లీ తిరిగి సమాధానం ఇవ్వలేకపోయి ఉండవచ్చు
  • రోవర్‌ ఇంకా పనిచేస్తూ ఉందని కచ్చితంగా చెప్పలేము.

గతంలో మూన్ ల్యాండర్‌ ‘విక్రమ్‌’ శకలాలను కూడా సుబ్రమణియన్ గుర్తించారు. ఆ విషయాన్ని నాసా కూడా నిర్ధారించింది. సుబ్రమణియన్ అందజేసిన సమాచారానికి సంబంధించిన ఆధారాలను పరీక్షిస్తున్నామని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. 2019, సెప్టెంబర్ లో ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి
:ప్రజ్ఞాన్ రోవర్‌ క్షేమం
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : చెన్నైకి చెందిన టెకీషణ్ముగసుబ్రమణియన్
ఎందుకు :చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొని నాశనమైందని భావిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్‌.. నిజానికి ధ్వంసం కాలేదని

Published date : 04 Aug 2020 11:48AM

Photo Stories