ప్రియాంక దూబేకు చమేలీదేవి జైన్ అవార్డు
Sakshi Education
ప్రముఖ పాత్రికేయురాలు, బీబీసీ ఢిల్లీ బ్యూరో ద్విభాషా వ్యాఖ్యాత ప్రియాంక దూబే ప్రతిష్టాత్మక చమేలీదేవి జైన్ అవార్డు-2018కు ఎంపికయ్యారు.
ఢిల్లీలో మార్చి 9న నిర్వహించనున్న కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పరిశోధనాత్మక జర్నలిజంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ప్రియాంకకు ఈ అవార్డు దక్కింది. పాత్రికేయంలో అసమాన ప్రతిభ చూపిన మహిళలకు గత 37 ఏళ్లుగా స్వాతంత్య్ర సమరయోధురాలైన చమేలిదేవి జైన్ పేరిట అవార్డును బహూకరిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చమేలీదేవి జైన్ అవార్డు-2018
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : ప్రియాంక దూబే
ఎందుకు : పరిశోధనాత్మక జర్నలిజంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : చమేలీదేవి జైన్ అవార్డు-2018
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : ప్రియాంక దూబే
ఎందుకు : పరిశోధనాత్మక జర్నలిజంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు
Published date : 08 Mar 2019 04:41PM