పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీ
Sakshi Education
దేశంలో వివిధ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలోని థాల్కాటోరా స్టేడియంలో జనవరి 29న నిర్వహించిన ‘పరీక్షా-పే చర్చ 2.0’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
దాదాపు 2 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ... తల్లిదండ్రులు తమ కలలను పిల్లలపై రుద్దవద్దని సూచించారు. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించే రీతిలో తల్లిదండ్రులు వ్యవహరించాలన్నారు. పిల్లల రిపోర్టు కార్డులను తమ విజిటింగ్ కార్డుల్లా పరిగణించవద్దని పేర్కొన్నారు. విద్యారులు పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ‘ఎగ్జామ్ వారియర్స్’ అనే పుస్తకాన్ని ప్రధాని మోదీ రచించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘పరీక్షా-పే చర్చ 2.0’ కార్యక్రమం
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : థాల్కాటోరా స్టేడియం, న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘పరీక్షా-పే చర్చ 2.0’ కార్యక్రమం
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : థాల్కాటోరా స్టేడియం, న్యూఢిల్లీ
Published date : 30 Jan 2019 05:34PM