ప్రధాని మోదీతో శ్రీలంక ప్రధాని రాజపక్స భేటీ
Sakshi Education
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స భేటీ అయ్యారు.
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 8న జరిగిన ఈ సమావేశంలో శ్రీలంకలో తమిళుల జీవన ప్రమాణాల పెంపు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవడం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు విసృ్త్తత స్థాయి చర్చలు జరిపారు. శ్రీలంకలోని తమిళుల సమస్యలను పరిష్కరించాలని, వారి హక్కుల కోసం అక్కడి రాజ్యాంగంలో ఉద్దేశించిన నిబంధనలను అమలు చేయాలని రాజపక్సను మోదీ కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో సహకారం అందించినందుకు మోదీకి రాజపక్స కృతజ్ఞతలు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఉగ్రవాదం, ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఉగ్రవాదం, ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు
Published date : 10 Feb 2020 05:55PM