ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం
Sakshi Education
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ఆగస్టు 6న సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం 13వ షెడ్యూలులో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాలని మోదీని జగన్ కోరారు. ఏపీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. గత ఐదేళ్లుగా ఏపీ ఎదుర్కొన్న పరిస్థితులు, తమ ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలను మోదీకి జగన్ వివరించారు.
ప్రధాని కార్యాలయ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేందర్ మిశ్రా, అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ పి.కె.మిశ్రాను కలసి ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ

Published date : 07 Aug 2019 05:19PM