Skip to main content

ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.
Current Affairsన్యూఢిల్లీలో ఫిబ్రవరి 12న జరిగిన ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని మోదీకి జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, తాజా పరిస్థితుల గురించి కూలంకషంగా వివరించారు. విభజనానంతరం అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రానికి తగిన విధంగా నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అంశాలపై ఒక లేఖ అందిస్తూ అందులోని విషయాలన్నింటినీ స్పష్టంగా వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళిక, శాసన మండలి రద్దు గురించి ప్రధానికి విశదీకరించారు.

ఇళ్ల కార్యక్రమానికి ఆహ్వానం..
2020, మార్చి 25వ తేదీ.. ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి రావాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. నవరత్నాల్లో భాగంగా ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టామని తెలిపారు.

సీఎం ప్రధానికి విన్నవించిన అంశాలు..
  • పోలవరం సవరించిన అంచనాలను(రూ.55,549 కోట్లు) ఆమోదించండి
  • అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి
  • పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలి.
  • కడప స్టీల్ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలి.
  • రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలి.
  • కృష్ణా- గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలి.
  • రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలి.
  • ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-2019ను ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలి.
  • హైకోర్టు కర్నూలుకు తరలించడానికి తగిన ఆదేశాలు ఇవ్వాలి
  • వెనకబడిన ఏడు జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలి.
Published date : 13 Feb 2020 05:50PM

Photo Stories