Skip to main content

ప్రధాని మోదీతో ఈయూ ఎంపీలు భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యులు భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో అక్టోబర్ 28న జరిగిన ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ... ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు.
కశ్మీర్‌లో పర్యటించడం ద్వారా జమ్మూ, కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యంతోపాటు అక్కడ జరుగుతున్న అభివృద్ధి, పాలనపరమైన అంశాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు.

మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోనూ ఈయూ ఎంపీల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం ఫలితంగా ఉత్పన్నమైన పరిస్థితిని ఈయూ ప్రతినిధి బృందానికి దోవల్ వివరించారు. ఈయూ బృందం అక్టోబర్ 29న కశ్మీర్‌లో పర్యటించి, ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకోనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యులు
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 29 Oct 2019 06:04PM

Photo Stories