ప్రధాని మోదీతో ఏడీబీ ప్రెసిడెంట్ భేటీ
Sakshi Education
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ప్రెసిడెంట్ టకెహికో నకావో భేటీ అయ్యారు.
ఢిల్లీలో ఆగస్టు 29న ఈ సమావేశం సందర్భంగా భారత్‌కు సుమారు రూ.86 వేల కోట్ల రుణం అందించేందుకు ఏడీబీ అంగీకారం తెలిపింది. వచ్చే మూడేళ్లలో పైపుల ద్వారా అందరికీ నీటి సరఫరా, రహదారి భద్రతకు సంబంధించి చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ఈ నిధులను ప్రభుత్వం వినియోగించనుంది.
ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నకావో మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ వేగంగా మార్పు చెందేందుకు తమ సాయం దోహదపడుతుందన్నారు. కేంద్రానికి ఆర్‌బీఐ నిధులను బదలాయించడం ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అమెరికా-చైనా వాణిజ్య వివాదం నుంచి కొన్ని భారత్ పరిశ్రమలు ప్రయోజనం పొందవచ్చన్నారు. నాలుగురోజుల నకయో భారత్ పర్యటన ఆగస్టు 30తో ముగుస్తుంది. మార్చి 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని ఏడీబీ అంచనా. 2020-21లో ఇది 7.2 శాతంగా ఉంటుందని విశ్లేషిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ప్రెసిడెంట్ టకెహికో నకావో
ఎక్కడ : న్యూఢిల్లీ

Published date : 30 Aug 2019 05:19PM