ప్రధాని మోదీతో భేటీ అయిన ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి?
Sakshi Education
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబ్బాట్ భేటీ అయ్యారు.
న్యూఢిల్లీలో ఆగస్టు 5న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం పూర్తి స్థాయిలో కొనసాగేందుకు గల అవకాశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆర్థిక సహకారం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఇండో–పసిఫిక్ ప్రాంత సుస్థిరత, భద్రత, అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తరఫున భారత్ ప్రత్యేక వాణిజ్య దూతగా అబ్బాట్ 2021, ఆగస్టు 2 నుంచి 6 వరకు దేశంలో పర్యటిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని మోదీతో భేటీ అయిన ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి?
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబ్బాట్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం...

Published date : 06 Aug 2021 06:05PM