ప్రధాని మోదీతో బంగ్లాదేశ్ ప్రధాని భేటీ
Sakshi Education
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భేటీ అయ్యారు.
న్యూఢిల్లీలో అక్టోబర్ 5న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, అస్సాంలో ఎన్నార్సీ ప్రచురణ ప్రక్రియ, రొహింగ్యా శరణార్థుల సమస్య వంటి అంశాలపై ప్రధానులిద్దరూ చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల అధికారులు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. చర్చల సందర్భంగా ఇద్దరు ప్రధానులు వీడియో లింకేజీ ద్వారా.. బంగ్లాదేశ్ నుంచి ఎల్‌పీజీ గ్యాస్‌ను ఈశాన్య రాష్ట్రాలకు తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టును, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్మించిన వివేకానంద భవన్‌ను, ఖుల్నాలో స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 07 Oct 2019 06:48PM