ప్రధాని మోదీకి యూఏఈ అత్యున్నత పురస్కారం
Sakshi Education
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అత్యున్నత పురస్కారం ‘జాయెద్ మెడల్’ లభించింది.
ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి విశేషంగా కృషి చేసినందుకు గుర్తింపుగా మోదీని ఈ పురస్కారంతో గౌరవిస్తున్నట్లు యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా జాయెద్ అల్ నహ్యాన్ ఏప్రిల్ 4న ప్రకటించారు. యూఏఈ-భారత్ మధ్య చారిత్రక, సమగ్ర వ్యూహాత్మక సంబంధాలను మోదీ అత్యున్నత స్థాయికి చేర్చారని అబూధాబీ యువరాజు, యూఏఈ సైనిక దళాల డిప్యూటీ కమాండర్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేర్కొన్నారు. వివిధ దేశాల అధినేతలు, అధ్యక్షులు, రాజులకు యూఏఈ జాయెద్ మెడల్‌ను అందజేస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీకి జాయెద్ మెడల్
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీకి జాయెద్ మెడల్
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు
Published date : 05 Apr 2019 06:25PM