ప్రధాని మోదీ నియోజకవర్గంలో ఆరు మార్గాల రహదారి ప్రారంభం
రూ. 2,447 కోట్లతో వారణాసి నుంచి అలహాబాద్ వరకు 73 కి.మీ.ల మేర నిర్మించిన ఈ ఆరు మార్గాల రహదారిని ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 30న జాతికి అంకితం చేశారు. అనంతరం కాశీ టెంపుల్ కారిడార్ పనులను సమీక్షించారు. గంగా నదీతీరంలో దీపాలు వెలిగించే ప్రఖ్యాత ‘దేవ్ దీపావళి’ కార్యక్రమాన్ని మోదీ వీక్షించారు.
మనోరమ బుక్‌లో వ్యాసం...
మనోరమ ఇయర్ బుక్-2021లో ‘అత్మనిర్భర్ భారత్-ట్రాన్‌సఫార్మింగ్ ఇండియా’ శీర్షికతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసం రాశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా 2020 ఏడాదిని మిగతా ప్రపంచం అంతా బాహ్య అంతరాయాల మయంగా భావిస్తోందని, భారత్‌కు మాత్రం అంతర్గత ఆవిష్కరణల సంవత్సరం అని మోదీ తన వ్యాసంలో అభివర్ణించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆరు మార్గాల రహదారి ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్
ఎందుకు : వారణాసి, అలహాబాద్ మధ్య అనుసంధానం కోసం