Skip to main content

ప్రధాని మోదీ బెల్జియం పర్యటన వాయిదా

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మార్చి 5న వెల్లడించింది.
Current Affairsకోవిడ్19(కరోనా వైరస్) విజృంభణ కారణంగా ప్రధాని పర్యటన వాయిదా పడినట్లు తెలిపింది. భారత్-యూరోపియన్ యూనియన్ సదస్సు ముందుగా నిర్ణయించిన ప్రకారం మార్చి 13న బెల్జియం రాజధాని నగరం బ్రసెల్స్‌లో జరగవలసి ఉంది. ఈ సదస్సులో మోదీ పాల్గొనాల్సి ఉండగా... ఆయన పర్యటన వాయిదా పడింది. దీంతో ఇరు వర్గాలకూ కుదిరే మరో సమయంలో భేటీ జరుగనుంది. మార్చి 4న బ్రసెల్స్‌లో కొత్తగా 10 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బెల్జియంలో ఈ కేసుల సంఖ్య 23కు పెరిగింది.

భారత్‌లో 30 కోవిడ్ కేసులు
ఇటలీకి చెందిన పర్యాటకులతో సహా మార్చి 4వ నాటికి భారత్‌లో 29 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. 28,529 మందిని వైద్యపరిశీలనలో ఉంచినట్టు వెల్లడించారు. ఇటీవలే ఇరాన్‌లో పర్యటించి వచ్చిన ఘజియాబాద్‌కు చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయి్యంది. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రధాని మోదీ బెల్జియం పర్యటన వాయిదా
ఎప్పుడు : మార్చి 5
ఎందుకు : కోవిడ్19(కరోనా వైరస్) విజృంభణ కారణంగా
Published date : 06 Mar 2020 05:42PM

Photo Stories