ప్రధాన సమాచార కమిషనర్‌గా బిమల్ జుల్కా
Sakshi Education
కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ప్రస్తుత సమాచార కమిషనర్ (ఐసీ) అయిన బిమల్ జుల్కా మార్చి 6న బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జుల్కా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సమాచార కమిషనర్‌గా అమిత పండోవే బాధ్యతలు స్వీకరించారు. ఆమె చేత సీఐసీ జుల్కా ప్రమాణ స్వీకారం చేయించారు. అమిత ఐసీ కావడంతో కేంద్ర సమాచార కమిషన్‌లో మొత్తం కమిషనర్ల సంఖ్య (సీఐసీతో కలిపి) 7కు చేరుకుంది.
మాజీ సీఐసీ సుధీర్ భార్గవ 2020, జనవరి 11న పదవీ విరమణ చేసినప్పటి నుంచి సీఐసీ పోస్టు ఖాళీగానే ఉంది. కేంద్ర సమాచార కమిషన్‌లో సీఐసీ కాకుండా 10 మంది కమిషనర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం 6 మందే ఉన్నారు. 2020, ఫిబ్రవరిలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ గతంలో సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా పనిచేసిన జుల్కా పేరును సీఐసీ పదవికి, అమిత పండోవేను సమాచార కమిషనర్ పదవికి సూచించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర సమాచార కమిషన్ సీఐసీగా ప్రమాణం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : బిమల్ జుల్కా
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ

Published date : 07 Mar 2020 05:50PM