Skip to main content

ప్రబుద్ధ భారత అనే మాస పత్రికను ఎవరు ప్రారంభించారు?

రామకృష్ణ పరమహంస బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్వామి వివేకానందుడు 1896 జూలైలో ‘‘ప్రబుద్ధ భారత(అవేకెన్‌డ్ ఇండియా)’’ అనే ఇంగ్లీషు మాస పత్రికను ప్రారంభించారు.
Current Affairsప్రబుద్ధ భారత 125 వార్షికోత్సవ వేడుకలను జనవరి 31న నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లోని మాయవతిలో ఉన్న అద్వైత ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... నిరుపేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వివేకానందుడు చూపిన బాటలో నడుస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

కృష్ -ఈ పురస్కారాలను ప్రదానం చేసిన సంస్థ?
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్‌లో భాగమైన ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ (ఎఫ్‌ఈఎస్) తాజాగా వ్యవసాయ రంగంలో సృజనాత్మక విధానాలు అమలు చేసిన రైతులకు కృష్-ఈ చాంపియన్ పురస్కారాలు ప్రకటించింది. 4 కేటగిరీల్లో 10 జాతీయ అవార్డులు అందించింది.
Published date : 05 Feb 2021 06:12PM

Photo Stories