Skip to main content

పోషణ్ అభియాన్‌లో ఏపీకి అవార్డులు

మాతాశిశు మరణాలు నివారించేందుకు కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు రెండు జాతీయ అవార్డులు లభించాయి.
2018-19కిగాను కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఈ అవార్డులను ప్రకటించింది. ఐసీడీఎస్ క్యాష్ (కామన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్) అమలులో మొదటిస్థానంలో నిలిచి ఏపీ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డు ద్వారా రాష్ట్రానికి రూ.కోటి పారితోషికం లభించనుంది. అలాగే పోషకాహార పంపిణీలో రెండో స్థానంలో నిలిచి అవార్డును దక్కించుకుంది. ఈ అవార్డు కింద రూ.1.5 కోట్లను కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అందజేస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2018-19కిగాను పోషణ్ అభియాన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండు అవార్డులు
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ
Published date : 23 Aug 2019 05:49PM

Photo Stories