Skip to main content

పోఖ్రాన్‌ను సందర్శించిన రాజ్‌నాథ్

రాజస్తాన్‌లోని పోఖ్రాన్(1974, 1998 అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతం)ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 16న సందర్శించారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘భారత్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చాలన్న అటల్‌బిహారీ వాజ్‌పేయి దృఢసంకల్పానికి ఈ ప్రాంతం ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. అణ్వస్త్రాలను ఇతరులపై మొదటగా ప్రయోగించరాదన్న సిద్ధాంతానికి భారత్ ఇప్పటికీ గట్టిగా కట్టుబడింది. కానీ భవిష్యత్‌లో ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఇది మారొచ్చు’అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వాజ్‌పేయి వర్థంతి సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు నివాళులు అర్పించారు.
Published date : 17 Aug 2019 04:59PM

Photo Stories