Skip to main content

పోక్సో బిల్లుకు పార్లమెంటు ఆమోదం

‘లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు-2019’ని పార్లమెంటు ఆగస్టు 1న ఆమోదించింది.
ఈ బిల్లును రాజ్యసభ జూలై 29నే ఆమోదించగా, లోక్‌సభలో బిల్లు ఆగస్టు 1న పాసయి్యంది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఈ బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెడుతూ చిన్నారులపై నేరాలను లింగభేదం లేకుండా ఒకేలా చూసేందుకు ఈ బిల్లును తెచ్చామన్నారు. దేశంలో 43 కోట్ల మంది చిన్నారులు ఉన్నారనీ, లింగభేదం లేకుండా వారందరికీ న్యాయపరంగా అదనపు భద్రతను ఈ బిల్లు కల్పిస్తుందని తెలిపారు.

బిల్లులోని ముఖ్యాంశాలు...
  • చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించవచ్చు
  • ‘చిన్నారులతో నీలి చిత్రాలు’ (చైల్డ్ పోర్నోగ్రఫీ)కి ఈ బిల్లులో నిర్వచనం కూడా చేర్చి, మరిన్ని ఎక్కువ దుశ్చర్యలను నేరం కిందకు వచ్చేలా చేశారు.
  • చిన్నారులపై అత్యాచారాలతోపాటు మైనర్లపై లైంగికదాడులకు పాల్పడే వారినీ కఠినంగా శిక్షించవచ్చు.
  • పోక్సో చట్టంలోని 2,4,5,6,9,14,15,34,42,45 సెక్షన్లను సవరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు-2019 ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : లోక్‌సభ
Published date : 02 Aug 2019 05:17PM

Photo Stories