పన్ను చెల్లింపుదారుల పోర్టల్ ఆవిష్కరణ
Sakshi Education
దేశంలో నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో ‘‘పారదర్శక పన్ను విధానం–నిజాయితీపరుల గుర్తింపు’’ పేరుతో ఏర్పాటైన ఓ వేదికను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 13న ఆన్లైన్ పద్ధతిలో ఆవిష్కరించారు.
అలాగే అవినీతిని గణనీయంగా తగ్గించే దిశగా సిద్ధం చేసిన పలు సంస్కరణలను ప్రారంభించారు. పారదర్శక పన్ను విధానం–నిజాయితీపరుల గుర్తింపు ప్లాట్‌ఫార్మ్ ద్వారా ప్రత్యక్ష పన్నుల విధానాల్లో సంస్కరణలను అమలు చేయనున్నారు. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందని ప్రభుత్వం తెలిపింది. పన్నుల మదింపు, వివాదాలపై అప్పీళ్లు అంశాల్లో వ్యక్తుల ప్రమేయం (ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, అప్పీల్స్) లేకుండా చేయడం ఈ సంస్కరణల్లో ఒకటి.
ఫేస్‌లెస్ అసెస్‌మెంట్..
తాజా సంస్కరణల్లో భాగంగా పన్ను చెల్లింపుదారుల చార్టర్, వ్యక్తుల ప్రమేయం లేని పన్ను మదింపును అమలు చేయడం ద్వారా పన్ను చెల్లింపులను అధికం చేయడంతో పాటు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ప్రోత్సహించడం వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త సంస్కరణల ఫలితంగా పన్ను చెల్లింపుదారులు ఏ పనికోసమైనా ఐటీ కార్యాలయాన్ని, అధికారిని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడదు. చార్టర్ కూడా ఆగస్టు 14 నుంచే అమల్లోకి రానుండగా ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ అనేది 2020, సెప్టెంబర్ 25 నుంచి అమలు కానుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పారదర్శక పన్ను విధానం–నిజాయితీపరుల గుర్తింపు పోర్టల్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు :నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో

Published date : 14 Aug 2020 05:23PM