Skip to main content

పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌లో అత్యధికంగా ఏ జాతి ప్రజలు ఉన్నారు?

అందరినీ భయపెట్టే తాలిబన్లకే వణుకుపుట్టించే పంజ్‌షీర్‌ లోయ కేంద్రంగా తాలిబన్లపై తిరుగుబాటు సన్నాహాలు జరుగుతున్నాయి.
కాబూల్‌కు ఉత్తరంగా ఉన్న మూడు నగరాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ ప్రక్రియలో 60 మంది తాలిబన్‌ సైనికులు గాయపడడం లేదా మరణించడం జరిగిందని అఫ్గాన్‌ తిరుగుబాటు ఆగస్టు 21న వర్గాలు ప్రకటించాయి.

ఏమిటీ పంజ్‌షీర్‌?
హిందూకుష్‌ పర్వత శ్రేణుల్లో కాబుల్‌కు ఉత్తరంగా పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ ఉంది. ఈ లోయ ప్రాంతంలో తజిక్‌ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. పంజ్‌షీర్‌ అంటే సంస్కృతంలో ఐదు సింహాలు అని అర్థం. 11వ శతాబ్దంలో ఒకమారు వచ్చిన వరద నీటిని అడ్డుకొనేందుకు ఐదుగురు సోదరులు ప్రయత్నించడంతో ఈ ప్రాంతానికి పంజ్‌షీర్‌ అని పేరువచ్చింది. పేరుకు తగ్గట్టే అక్కడి ప్రజల్లో తెగింపు చాలా ఎక్కువ. గతంలో తాలిబన్ల పాలనను తుదముట్టించడంలోనూ ఈ ప్రాంతానిదే కీలకపాత్ర.

హెరాత్‌లో కోఎడ్యుకేషన్‌పై నిషేధం
పాత పరిపాలనను గుర్తు చేస్తూ తాలిబన్లు విధాన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. తాజాగా హెరాత్‌ ప్రావిన్స్‌లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. సమాజంలో అన్ని అనర్థాలకు కోఎడ్యుకేషనే కారణమని, అందుకే దీన్ని నిషేధిస్తున్నామని తెలిపారు.

కాబూల్‌లో బరాదర్‌...
అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని కొలువు తీర్చేందుకు తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఆగస్టు 21న కాబూల్‌కు చేరుకున్నారు.
Published date : 23 Aug 2021 05:53PM

Photo Stories