పంచతత్వ పార్కు ప్రారంభం
Sakshi Education
జీహెచ్‌ఎంసీ జీవవైవిధ్య విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న ఇందిరాపార్కులో రూ.15 లక్షల నిధులతో పంచతత్వ పార్కును నిర్మించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంచతత్వ పార్కు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : ఇందిరా పార్కు, హైదరాబాద్
ఈ పంచతత్వ పార్కును తెలంగాణ రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు నవంబర్ 15న ప్రారంభించారు. కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
చదవండి: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఏ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు?
పంచతత్వ పార్కు ప్రత్యేకతలు...
- పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలిని దృష్టిలో ఉంచుకొని దీనిని ఏర్పాటు చేశారు. ఇది వలయాకారంలో 8 భాగాలుగా ఉంటుంది. నడిచే సమయంలో దీనిపై దృష్టి సారిస్తే ఏకాగ్రత పెరుగుతుంది.
- పార్కులో మొత్తంగా 40 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి.
- ఈ ట్రాక్‌లో నడవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. కంటిచూపు, రక్త ప్రసరణ, వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుంది. వివిధ మలుపుల్లో నడక కారణంగా అన్ని శరీర భాగాలకు వ్యాయామం కలుగుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంచతత్వ పార్కు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : ఇందిరా పార్కు, హైదరాబాద్
Published date : 17 Nov 2020 05:24PM