పంచాయతీ రాజ్ చట్ట సవరణకు ఆమోదం
Sakshi Education
సర్పంచులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘పంచాయతీ రాజ్ చట్ట సవరణ’ ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
మున్సిపల్ చట్ట సవరణకు అంగీకారం...
మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఉన్న 24 రోజుల కాలపరిమితిని 15 రోజులకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మున్సిపల్ చట్ట సవరణకు కేబినెట్ అంగీకారం తెలిపింది. పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకూ వర్తింప చేస్తారు.
అవినీతికి పాల్పడితే మూడేళ్లు జైలు..
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి చర్యలకు పాల్పడినట్లు రుజువైన వారిపై అనర్హత వేటుతోపాటు మూడేళ్లు జైలు శిక్ష విధించేందుకు వీలుగా చట్టంలో సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం అవినీతికి పాల్పడ్డారని గెలిచిన తర్వాత రుజువైతే కూడా అలాంటి వారిపై అనర్హత వేటు వేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంచాయతీ రాజ్ చట్ట సవరణకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : సర్పంచులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు
సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 12న సమావేశమైన మంత్రివర్గం పంచాయతీ రాజ్ చట్ట సవరణతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ ప్రకారం.. పచ్చదనం, పారిశుధ్యాన్ని పెంపొందించే బాధ్యతలను సర్పంచులే నిర్వహించాలి. అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వారు అత్యవసర నిర్ణయాలు తీసుకోవచ్చు. సర్పంచులు ఆయా గ్రామాల్లోనే నివాసం ఉండాలి.
మున్సిపల్ చట్ట సవరణకు అంగీకారం...
మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఉన్న 24 రోజుల కాలపరిమితిని 15 రోజులకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మున్సిపల్ చట్ట సవరణకు కేబినెట్ అంగీకారం తెలిపింది. పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకూ వర్తింప చేస్తారు.
అవినీతికి పాల్పడితే మూడేళ్లు జైలు..
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి చర్యలకు పాల్పడినట్లు రుజువైన వారిపై అనర్హత వేటుతోపాటు మూడేళ్లు జైలు శిక్ష విధించేందుకు వీలుగా చట్టంలో సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం అవినీతికి పాల్పడ్డారని గెలిచిన తర్వాత రుజువైతే కూడా అలాంటి వారిపై అనర్హత వేటు వేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంచాయతీ రాజ్ చట్ట సవరణకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : సర్పంచులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు
Published date : 13 Feb 2020 05:52PM