Skip to main content

పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు శంకుస్థాపన

శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఉద్దాన ప్రాంత ప్రజల కోసం రూ.600 కోట్లతో నిర్మించనున్న శుద్ధ జలాల సరఫరా ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 6న శంకుస్థాపన చేశారు.
రూ.50 కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, కిడ్నీ రిసెర్చ్ సెంటర్ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేశారు. వీటితోపాటు జ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం రూ.11.95 కోట్లతో నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎం పురం పంచాయతీలో ఉన్న రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో(శ్రీకాకుళం ఆర్జీయూకేటీ) రూ.28 కోట్ల వ్యయంతో నిర్మించిన అకడమిక్ భవనం, వసతి గృహం, మెస్‌ను ముఖ్యమంత్రి సెప్టెంబర్ 6న ప్రారంభించారు. పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : కిడ్నీ రిసెర్చ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పలాస, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 10 Sep 2019 08:24PM

Photo Stories