Skip to main content

పినాక క్షిపణి పరీక్ష విజయవంతం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పినాక క్షిపణి వ్యవస్థను భారత రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది.
Current Affairsఒడిశాలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి డిసెంబర్ 20న ఈ క్షిపణిని పరీక్షించింది. డీఆర్‌డీవో రూపొందించిన ఈ క్షిపణి 75 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ పేర్కొంది.

పినాక ఎంకే-2 రాకెట్‌ను నేవిగేషన్, నియంత్రణ, మార్గదర్శకత్వ సాయంతో కచ్చితత్వం సాధించే క్షిపణిగా రూపాంతరం చెందించారు. ఈ క్షిపణి నావిగేషన్ వ్యవస్థకు భారత ప్రాంతీయ నేవిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్‌ఎన్ ఎస్‌ఎస్) కూడా సాయమందిస్తుంది. ఇలాంటి ఫిరంగి క్షిపణి వ్యవస్థను డిసెంబర్ 10న విజయవంతంగా పరీక్షించారు. 2019, మార్చిలోనూ పినాక మార్గదర్శక రాకెట్ వ్యవస్థలను రాజస్థాన్‌లోని పోఖ్రాన్ నుంచి విజయవంతంగా పరీక్షించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పినాక క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : భారత రక్షణ శాఖ
ఎక్కడ : చాందీపూర్, బాలసోర్ జిల్లా, ఒడిశా
Published date : 21 Dec 2019 06:00PM

Photo Stories