పీవోకేలో భారీ భూకంపం
Sakshi Education
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో సెప్టెంబర్ 24న భారీ భూకంపం సంభవించింది.
ఈ భూకంపం కారణంగా 26 మంది మృతి చెందగా 300 మందికిపైగా గాయపడ్డారు. ఇస్లామాబాద్‌తోపాటు ఉత్తర ప్రాంతంలోని పలు నగరాల్లో భూమి కంపించింది. పంజాబ్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతం జీలం కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని పాకిస్తాన్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే, దీని తీవ్రత 7.1 వరకు ఉందని పాక్ సైన్స్ శాఖ మంత్రి ఫవాద్ ఛౌదరి అన్నారు. భూకంప కేంద్రం పీవోకేలోని న్యూ మీర్పూర్ సమీపంలో ఉందని అమెరికా పేర్కొంది.
ఉత్తర భారతంలోనూ అలజడి
ఉత్తర భారతంలోని ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, హరియాణాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత 6.3గా ఉందని అధికారులు ప్రకటించారు. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారీ భూకంపం
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎక్కడ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)

Published date : 25 Sep 2019 06:01PM