పీవీ విజ్ఞాన వేదికను ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు?
Sakshi Education
బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రత్యేకతలను భావితరాలకు తెలియజేసేందుకు పీవీ సొంత గ్రామమైన వంగరలో ఓ విజ్ఞానవేదిక రూపుదిద్దుకుంటోంది.
తెలంగాణ పర్యాటకాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ వేదిక నిర్మిస్తున్నారు. త్వరలో పనులు మొదలుకానున్నాయి. 2022లో పీవీ జయంతి నాటికి వేదికను ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ‘‘పీవీ విజ్ఞాన వేదిక’’ పేరుతో నాలుగు ఎకరాల్లో దీన్ని రూపొందిస్తున్నారు. పర్యాటకులు పీవీ గురించి తెలుసుకునేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. వంగర గ్రామం ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా బీమదేవరపల్లి మండలంలో ఉంది.
మ్యూజియంగా పీవీ ఇల్లు
వంగర గ్రామంలో పీవీ నరసింహారావు నివసించిన ఇంటిని మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన వాడిన వస్తువులు, ఆయన ఛాయాచిత్రాలు ఇందులో ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు రూ.11 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీవీ విజ్ఞాన వేదిక నిర్మాణం
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : తెలంగాణ పర్యాటకాభి వృద్ధి సంస్థ
ఎక్కడ : వంగర, బీమదేవరపల్లి మండలం, వరంగల్ అర్బన్ జిల్లా
ఎందుకు : భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రత్యేకతలను భావితరాలకు తెలియజేసేందుకు

Published date : 23 Jan 2021 06:20PM