పీవీ సింధుకి ఈఎస్‌పీఎన్ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు
Sakshi Education
ప్రపంచ చాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి ఈఎస్‌పీఎన్ ఉత్తమ క్రీడాకారిణి-2019 అవార్డు లభించింది.
మొత్తం 10 విభాగాల్లో ప్రకటించిన ఈ అవార్డులను ప్రకటించగా... పురుషుల విభాగంలో యువ షూటర్ సౌరభ్ చౌదరికి ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం దక్కింది. అలాగే స్పి్రంటర్ ద్యుతి చంద్‌కు ధీశాలి అవార్డు రాగా.. ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి ఉత్తమ పునరాగమనం అవార్డును కైవసం చేసుకుంది. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను ‘ఉత్తమ కోచ్’ అవార్డు వరించింది. పీవీ సింధుకి ఈఎస్‌పీఎన్ పురస్కారం లభించడం ఇది వరుసగా మూడోసారి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈఎస్‌పీఎన్ ఉత్తమ క్రీడాకారిణి-2019 అవార్డు విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : పీవీ సింధు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈఎస్‌పీఎన్ ఉత్తమ క్రీడాకారిణి-2019 అవార్డు విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : పీవీ సింధు
Published date : 21 Feb 2020 05:41PM