పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏ కమిషన్ ఆధ్వర్యంలో పని చేస్తుంది?
చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా అధినేత షి జిన్‌పింగ్ నవంబర్ 25న సమావేశంలో ప్రసంగించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)ని ప్రపంచంలోనే అత్యున్నత సైనిక శక్తిగా తీర్చిదిద్దనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకోసం నిజమైన పోరాట పరిస్థితుల్లో సైన్యానికి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. 20 లక్షల మంది సైన్యం ఉన్న పీఎల్‌ఏ... సెంట్రల్ మిలటరీ కమిషన్ ఆధ్వర్యంలోనే పని చేస్తుంది. సీఎంసీ చైర్మన్‌గా జిన్‌పింగ్ ఉన్నారు.
రెండో అతిపెద్ద సైనిక బడ్జెట్...
2027 నాటికి పీఎల్‌ఏని ప్రపంచంలోనే అత్యున్నత సైనిక శక్తిగా తీర్చిదిద్దాలని చైనా కమ్యూనిస్టు పార్టీ ఇటీవల ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. 2020లో సైన్యంపై 179 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు పార్టీ ఆమోదం తెలిపింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక బడ్జెట్. 732 బిలియన్ డాలర్లతో అమెరికా తొలిస్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) సమావేశం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : చైనా అధ్యక్షుడు, సీఎంసీ చైర్మన్ షి జిన్‌పింగ్
ఎక్కడ : బీజింగ్, చైనా