పీఎస్‌ఎల్‌వీ సీ49 ప్రయోగం విజయవంతం
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ49 (పీఎస్‌ఎల్‌వీ-డీఎల్) ప్రయోగం విజయవంతమైంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నవంబర్ 7న ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు 630 కిలోల బరువు కలిగిన పది ఉపగ్రహాలను 575 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్త ధ్రువకక్ష్యలోకి (సన్ సింక్రనస్ ఆర్బిట్) విజయవంతంగా ప్రవేశపెట్టారు.
పది ఉపగ్రహాలు...
పీఎస్‌ఎల్‌వీ సీ49 ప్రయోగం ద్వారా భారత అవసరాల నిమిత్తం రూపొందించిన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-01) అనే ఉపగ్రహంతో పాటు లిథువేనియాకు చెందిన ఆర్-2, లక్జెంబర్గ్‌కు చెందిన కేఎస్‌ఎం-1ఏ, కేఎస్‌ఎం-1బీ, కేఎస్‌ఎం-1సీ, కేఎస్‌ఎం-1డీ, అమెరికాకు చెందిన లిమూర్ అనే ఉపగ్రహాల శ్రేణిలో నాలుగు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
ఈఓఎస్-01...
ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-01) ఉపగ్రహాన్ని మన భారతదేశ అవసరాల కోసం రూపొందించారు. ఇది రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహమే అయినప్పటికీ, ఇందులో ఉన్న శక్తిమంతమైన కెమెరాలు రైతులకు ఉపయోగపడేలా, వ్యవసాయానికి సంబంధించిన పలు విషయాల పూర్తిస్థాయి సమాచారాన్ని అందిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎస్‌ఎల్‌వీ సీ49 (పీఎస్‌ఎల్‌వీ-డీఎల్) ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)
ఎక్కడ : సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

Published date : 09 Nov 2020 05:48PM