Skip to main content

పీఎస్‌ఎల్‌వీ సీ49 ద్వారా విదేశాలకు చెందిన ఎన్ని ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు?

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి 2020, నవంబర్‌ 7న సాయంత్రం 3.02 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ49 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అక్టోబర్ 28న ప్రకటించింది.

Current Affairs


ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్ శాటిలైట్‌ (ఈఓఎస్‌–01) అనే ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 చిన్న తరహా ఉపగ్రహాలను నింగిలోకి పంపించనున్నారు. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ ఈఓఎస్‌–01ను రూపొందించారు. తొలుత ఈ ప్రయోగాన్ని 2020, మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. కరోనాలాక్‌డౌన్ కారణంగా నవంబర్‌ 7కి వాయిదా వేశారు.

క్విక్ రివ్వూ :

ఏమిటి : 2020, నవంబర్‌ 7న పీఎస్‌ఎల్‌వీ సీ49 ప్రయోగం
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)
ఎక్కడ : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్), శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
ఎందుకు :భారత్‌కు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్ శాటిలైట్‌ (ఈఓఎస్‌–01) అనే ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 చిన్న తరహా ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు
Published date : 29 Oct 2020 05:37PM

Photo Stories