పీఎస్‌ఎల్‌వీ సీ44 ప్రయోగం విజయవంతం
Sakshi Education
వినూత్న ఉపగ్రహ వాహక నౌక పీఎస్‌ఎల్‌వీ సీ44 (పీఎస్‌ఎల్‌వీ-డీఎల్)ను భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి జనవరి 24న ఈ ప్రయోగాన్ని చేపట్టారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 46వ ప్రయోగమైన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను మొట్ట మొదటిసారిగా రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో రూపొందించి విజయవంతంగా ప్రయోగించారు.
పీఎస్‌ఎల్‌వీ సీ44 ద్వారా తమిళనాడులోని హైస్కూల్ విద్యార్థులు తయారు చేసిన కలాంశాట్, ఇండియన్ డిఫెన్స్ కు ఉపయోగపడే మైక్రోశాట్-ఆర్ అనే రెండు ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. ముందుగా మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహాన్ని భూమికి 274.2 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1.5 కిలోలు బరువు కలిగిన కలాంశాట్‌ను 450 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎస్‌ఎల్‌వీ సీ44 ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో)
ఎక్కడ : సతీస్ ధవన్ స్పేస్ సెంటర్, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

Published date : 25 Jan 2019 04:11PM