పీఎన్‌బీ ఎండీ, సీఈఓగా మల్లికార్జున రావు
Sakshi Education
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా సీహెచ్ ఎస్‌ఎస్ మల్లికార్జున రావు నియమితులయ్యారు.
ఈ మేరకు ఆయన నియామకానికి నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) అక్టోబర్ 1న ఆమోదం తెలిపింది. 2021 సెప్టెంబర్ 18 వరకూ లేదా తదుపరి ఉత్తర్వ్యులు వెలువడేవరకూ మల్లికార్జునరావు ఈ పదవిలో ఉంటారని ఏసీసీ తెలిపింది. ప్రస్తుతం అలహాబాద్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా మల్లికార్జునరావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పీఎన్‌బీలో యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఎండీ, సీఈఓగా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : సీహెచ్ ఎస్‌ఎస్ మల్లికార్జున రావు

Published date : 02 Oct 2019 04:48PM