పీఎంవో నుంచి వైదొలిగిన సెక్రటరీ మిశ్రా
Sakshi Education
ప్రధానమంత్రి కార్యలయం(పీఎంవో)లో ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఉన్న నృపేంద్ర మిశ్రా తన బాధ్యతల నుంచి ఆగస్టు 30న వైదొలిగారు.
అయితే రెండు వారాలు ఆ పదవిలో కొనసాగాల్సిందిగా ప్రధాని మోదీ ఆయనను కోరినట్లు ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి సితాన్షు కర్ తెలిపారు. దీంతో రెండు వారాలపాటు ఆయన తాత్కాలికంగా కొనసాగుతారు. 1967 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మిశ్రా వివిధ బాధ్యతల అనంతరం 2009లో ట్రాయ్ చైర్మన్‌గా వైదొలిగారు. 2014లో పీఎంవోలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ అయ్యారు.
మిశ్రా పీఎంవో నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఇటీవలే కేబినెట్ కార్యదర్శిగా పదవీవిరమణ చేసిన పీకే సిన్హాను పీఎంఓలో ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’(ఓఎస్డీ)గా ప్రభుత్వం నియమించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎంవో నుంచి వైదొలిగిన ప్రిన్సిపాల్ సెక్రటరీ
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : నృపేంద్ర మిశ్రా

Published date : 31 Aug 2019 05:35PM