Skip to main content

పీఎంకేవై కింద 12,305 కోట్ల పంపిణీ

అర్హులైన రైతులకు ప్రధానమంత్రి కిసాన్ పథకం(పీఎంకేవై) కింద ఇప్పటి వరకూ రూ. 12,305 కోట్లు పంపిణీ చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
ఈ మేరకు ఆయన రాజ్యసభలో జూన్ 21న లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంగా పీఎంకేవై కింద అందించే రూ. 6,000 మూడు దఫాల్లో చెల్లించనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 14.5కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారని వివరించారు. భూపరిమితితో నిమిత్తం లేకుండా సహాయం అందిస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ. 87,215.50 కోట్ల భారం పడనున్నదని చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రధానమంత్రి కిసాన్ పథకం(పీఎంకేవై) కింద రూ. 12,305 కోట్ల పంపిణీ
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
Published date : 22 Jun 2019 05:52PM

Photo Stories