పీఎంజీఎస్‌వై మూడో దశ ప్రారంభం
Sakshi Education
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)మూడో దశ ప్రారంభమైంది.
న్యూఢిల్లీలో డిసెంబర్ 18న కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ ఆవాసప్రాంతాల నుంచి వ్యవసాయ మార్కెట్‌యార్డులు, ఉన్నత పాఠశాలలు, ఆసుపత్రులను కలుపుతూ 1.25 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారులు నిర్మించాలన్నది ఈ పథకం లక్ష్యం. ఇందుకోసం మొత్తం రూ.80,250 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో కేంద్రప్రభుత్వం రూ.53,800 కోట్లు సమకూర్చుతుంది. మిగిలింది రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్‌గా సమకూర్చాల్సి ఉంటుంది. పథకం కాలపరిమితి 2019-20 నుంచి 2024-25 వరకు ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎంజీఎస్‌వై మూడో దశ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎంజీఎస్‌వై మూడో దశ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 19 Dec 2019 06:08PM