పీఎం స్వనిధి పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన నగరాల సంఖ్య?
గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా డిసెంబర్ 11న ఈ పెలైట్ ప్రాజెక్టును ప్రారంభించారు. లబ్ధిదారుల ప్రొఫైల్డ్ డేటా ఆధారంగా, వారి సమగ్ర సామాజిక-ఆర్థిక అభ్యున్నతి కోసం వివిధ కేంద్ర పథకాల ప్రయోజనాలు వారికి విస్తరించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది.
ఈ పెలైట్ ప్రాజెక్టు మొదటి దశలో 125 నగరాలను ఎంపిక చేశారు. ముందుగా గయా, ఇండోర్, నిజామాబాద్, రాజ్‌కోట్,వారణాసి తదితర నగరాల్లో పైలట్ ప్రోగ్రాం అమలు చేస్తారు.
చదవండి: పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఎంత మొత్తాన్ని రుణంగా అందించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎం స్వనిధి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ
ఎక్కడ : మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 125 నగరాల్లో
ఎందుకు : పీఎం స్వనిధి పథకం ద్వారా రుణ సహాయం పొందుతున్న వీధి వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులతో కూడిన సమగ్ర వివరాలను క్రోడీకరించేందుకు