Skip to main content

పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన ప్రారంభం

18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు 60 ఏళ్ళు దాటాక నెలకు 3000 రూపాయల పెన్షన్ అందించేందుకు ఉద్దేశించిన ‘ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన’ ప్రారంభమైంది.
జార్ఖండ్ రాజధాని రాంచీలో సెప్టెంబర్ 12న నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్ మన్‌ధన్ యోజన, స్వరోజ్‌గార్ పెన్షన్ స్కీంలను కూడా మోదీ ప్రారంభించారు. ఈ రెండింటి ప్రకారం సైతం 60 ఏళ్ల తరువాత లబ్దిదారులకు ప్రతినెలా 3000 రూపాయల పెన్షన్ లభిస్తుంది.

ఆదివాసీ విద్యార్థులకోసం 462 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను రాంచీలోని ధృవలో ఉన్న ప్రభాత్ తారా మైదాన్ నుంచి మోదీ ప్రారంభోత్సవం చేశారు. వీటితో పాటు జార్ఖండ్ నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ.. దేశంలోని గడపగడపకీ రక్షిత మంచి నీరు తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ అన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రాంచీ, జార్ఖండ్
ఎందుకు : 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు 60 ఏళ్ళు దాటాక నెలకు 3000 రూపాయల పెన్షన్ అందించేందుకు
Published date : 13 Sep 2019 06:06PM

Photo Stories