Skip to main content

పీఎం కేర్స్‌ నిధుల మళ్లింపు అనవసరం

కోవిడ్‌–19 విపత్తును ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌ నిధులను జాతీయ విపత్తు నిధి (ఎన్డీఆర్‌ఎఫ్‌)కి బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Current Affairs
సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఒక పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఆగస్టు 18న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పీఎం కేర్స్‌ ఫండ్, ఎన్డీఆర్‌ఎఫ్‌లు పూర్తిగా భిన్నమైనవని, వేర్వేరు ఉద్దేశాలతో ఏర్పాటైనవని పేర్కొంది. కోవిడ్‌ విపత్తును ఎదుర్కొనడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులను కేంద్రం వాడుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. ఎన్డీఆర్‌ఎఫ్‌కు స్వచ్ఛందంగా ఎప్పుడైనా విరాళాలు ఇవ్వవచ్చని పేర్కొంది.

చదవండి: పీఎం కేర్స్‌ ఏర్పాటు, చైర్మన్, సభ్యులు 

జూమ్‌కార్‌తోఎంజీ మోటార్స్‌ ఒప్పందం
ప్రముఖ స్పోర్ట్స్‌ కార్ల బ్రాండ్‌ ఎంజీ మోటార్స్‌ దేశంలోని అతిపెద్ద మొబిలిటీఫ్లాట్‌ఫామ్‌ జూమ్‌కార్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా 12, 24, 36 నెలల సబ్ర్‌స్కిప్షన్లకుఎంజీ మోటార్స్‌ కార్లను అద్దెకు తీసుకోవచ్చని ఎంజీ మోటార్స్‌ కంపెనీ తెలిపింది. ఈ విధానంతో కొనుగోలుదారులు ఎంజీ కార్లను కొనుగోలు చేయడానికి ముందే కారులోని టెక్నాలజీ, ఫీచర్లు, డ్రైవింగ్‌ అనుభవం వంటివి తెలుస్తాయని ఎంజీ మోటార్స్‌ ఇండియా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ గౌరవ్‌ గుప్తా తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎం కేర్స్‌ ఫండ్‌ నిధులను జాతీయ విపత్తు నిధి (ఎన్డీఆర్‌ఎఫ్‌)కి బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేందుకు తిరస్కరణ
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు :పీఎం కేర్స్‌ ఫండ్, ఎన్డీఆర్‌ఎఫ్‌లు పూర్తిగా భిన్నమైనవని, వేర్వేరు ఉద్దేశాలతో ఏర్పాటైనవని
Published date : 20 Aug 2020 11:52AM

Photo Stories